ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ భారత్తో జరిగే రెండో వన్డేకు దూరమయ్యే అవకాశముంది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో అతడికి గాయమవ్వడమే ఇందుకు కారణం. అతడి స్థానంలో కామెరూన్ గ్రీన్, హెన్రిక్స్.. వీరిద్దరిలో ఒకరు అందుబాటులో ఉంటారని తెలిసింది.
గాయంతో రెండో వన్డేకు స్టొయినిస్ దూరం! - స్టొయినిస్
టీమ్ఇండియాతో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్కు గాయమైంది. రెండో వన్డేకు అతడు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలోకి కామెరూన్ గ్రీన్ ఆడే అవకాశముంది.
స్టొయినిస్
స్టొయినిస్ గాయంపై ఆసీస్ స్టార్ బ్యాట్స్మన్ స్మిత్ మాట్లాడుతూ "అతడు జట్టులో ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ స్టొయినిస్ అందుబాటులో లేకుంటే.. గ్రీన్ బరిలో దిగొచ్చు. బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ గ్రీన్ ప్రతిభావంతమైన ఆటగాడు" అని కితాబిచ్చాడు.
ఇదీ చూడండి : దంచికొట్టిన ఆస్ట్రేలియా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి
Last Updated : Nov 27, 2020, 10:58 PM IST