ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడటం తన కెరీర్లో పెద్ద మలుపని అన్నాడు టీమ్ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్. కీలక ఓవర్లలో ఒత్తిడిని తట్టుకుంటూ బౌలింగ్ చేయడం సహా యార్కర్లు వేయగల సామర్థ్యాన్ని ఆ జట్టుతో ఉన్నప్పుడే నేర్చుకున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
"నాకు యార్కర్లు వేయగల సామర్థ్యం ఉంది. కానీ, క్రమంగా దాన్ని కోల్పోయా. ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టులో ఆడే సమయంలో మొదటి, చివరి ఓవర్లను నాతో బౌలింగ్ చేయించేవారు. 2014లో 14 మ్యాచ్‌ల అనుభవంతో ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్చుకున్నా. అదే నా కెరీర్‌కు మలుపు. ప్రత్యేకంగా డెత్ ఓవర్లలో ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో అవగాహన చేసుకున్నా. ధోనీలాగా నేను ఫలితం గురించి ఆలోచించకుండా కెరీర్‌పై దృష్టి సారించా. దీంతో చివరికి అవే ఫలితాన్ని పొందడంలో సహాయపడ్డాయి".