ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె అదరగొట్టాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ తడబడుతున్నా తాను మాత్రం దృఢంగా నిలబడి సెంచరీ చేశాడు. దీంతో భారత పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే ఈ శతకం కంటే ఇంగ్లాండ్‌పై లార్డ్స్ చేసిన సెంచరీనే తనకు ఎప్పటికీ ఉత్తమమని అన్నాడు.
"సెంచరీ చేయడం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇంగ్లాండ్‌పై లార్డ్స్‌లో చేసిన శతకం నా కెరీర్లో ది బెస్ట్. ఆసీస్‌తో బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజూ మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. కెప్టెన్సీ ఆటగాళ్లకు మద్దతుగా నిలవడానికే. ఇందులో క్రెడిట్ అంతా బౌలర్లదే.. వారు సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేశారు. అయితే ఈ మ్యాచ్ ఇంకా పూర్తి కాలేదు. మేం ఇంకా నాలుగు వికెట్లు తీయాల్సి ఉంది"
- అజింక్య రహానె, టీమ్ఇండియా టెస్టు తాత్కాలిక కెప్టెన్