గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అనేక తరహాలో ప్రత్యర్థి జట్టు క్రీడాకారుల్ని వివిధ రకాలుగా దూషించటం, రెచ్చగొట్టడం చేసేవారు. కానీ, వాళ్లు చేసే పనులకు సమాధానమివ్వడం ఇష్టమంటున్నాడు టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కన్నా స్టీవ్ స్మిత్‌పై స్లెడ్జింగ్ చేయాలనుకుంటానని చెప్పాడు.
పాంటింగ్ కన్నా స్మిత్‌నే అలా అంటాను: ఇషాంత్
ఆసీస్ ఆటగాడు స్మిత్‌ను స్లెడ్జింగ్ చేయటం తనకు ఇష్టమని చెప్పాడు టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ. గతంలో రికీ పాంటింగ్, స్మిత్‌పై తనదైన హావభావాలు ప్రదర్శించడం నెట్టింట వైరల్ అయింది. తాజాగా వాటిపై వివరణ ఇచ్చాడీ స్టార్ పేసర్.
2007లో పెర్త్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ నుంచి రికీ పాంటింగ్, ఇషాంత్ మధ్య స్లెడ్జింగ్ మొదలైంది. అదే విధంగా 2017లో బెంగళూరు వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇషాంత్, స్మిత్‌ల మధ్య మరో హాస్యాస్పద సన్నివేశం జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇద్దరూ స్లెడ్జింగ్ చేసుకున్నారు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు పాంటింగ్ కన్నా స్మిత్‌ను స్లెడ్జింగ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతానని ఇషాంత్ వెల్లడించాడు.
ఇదీ చూడండి.. ప్రాక్టీసు మధ్యలో వదిలిపెట్టి రాంచీకి వెళ్లిన ధోనీ