తెలంగాణ

telangana

ETV Bharat / sports

ట్యాంపరింగ్​ ఒకటే అయినా బోర్డు శిక్షలు వేరే...! - ట్యాంపరింగ్​ ఒకటే అయినా బోర్డు శిక్షలు వేరే

ఆస్ట్రేలియా సీనియర్​ క్రికెటర్​ స్టీవ్​ స్మిత్​ బాల్​ ట్యాంపరింగ్​ అంశంపై మాట్లాడాడు. ఇదే విషయంలో 12 నెలల నిషేధం ఎదుర్కొన్న ఇతడు... తాజాగా విండీస్​ ఆటగాడు పూరన్​పై పడిన వేటు గురించి ఆసక్తికర సమాధానమిచ్చాడు.

ట్యాంపరింగ్​ ఒకటే అయినా బోర్డు శిక్షలు వేరే...!

By

Published : Nov 20, 2019, 6:33 AM IST

లఖ్​నవూ వేదికగా ఇటీవలే ఆఫ్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఫలితంగా అతనిపై నాలుగు టీ20 మ్యాచ్‌ల నిషేధం పడింది. అయితే ఇదే తరహాలో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ గతంలో బాల్‌ ట్యాంపరింగ్‌ చేశాడు. ఈ ఆస్ట్రేలియా ఆటగాడు మాత్రం ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. తాజాగా పూరన్‌కు ఎందుకు తక్కువ శిక్ష పడిందని స్టీవ్‌ స్మిత్‌ను అడిగారు.

పూరన్​కు తక్కువ నిషేధం పడితే తనకేం సంబంధం అని ప్రశ్నించిన స్మిత్​... శిక్షాకాలం తక్కువ ఉండటం వల్ల తనకు ఇబ్బందేమీ లేదన్నాడు.

"ప్రతి ఒక్కరూ విభిన్నంగా ఉంటారు. ప్రతీ దేశ క్రికెట్​ బోర్డు అంతే. ఇలాంటి సందర్భాల్లో చాలా విషయాలు కలిసి ఉంటాయి. నాకు కఠినమైన శిక్ష పడిందని నేనేమీ నిరూత్సాహపడలేదు. అది గతం. నేను దాని నుంచి బయటపడి వర్తమానంలో బ్రతుకుతున్నా. నాకు నికోలస్‌ పూరన్​ తెలుసు. అతనితో క్రికెట్‌ ఆడిన అనుబంధం ఉంది. అతనొక టాలెంట్‌ ఉన్న క్రికెటర్‌. మంచి భవిష్యత్తు ఉంది. అతను.. చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు."
-- స్టీవ్​ స్మిత్​ , ఆసీస్​ క్రికెటర్.

ఆఫ్గానిస్థాన్​తో జరిగిన మూడో వన్డేలో విండీస్​ క్రికెటర్ పూరన్​​ బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు తేల్చింది ఐసీసీ. బంతి ఆకారాన్ని మార్చినట్లు పూరన్‌ అంగీకరించి, క్షమాపణలూ కోరాడు. ఫలితంగా నాలుగు మ్యాచ్​ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details