కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల స్టీవ్‌స్మిత్ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని ఆస్ట్రేలియా మాజీ సారథి కిమ్ హ్యూస్ అన్నారు. అందువల్లే టీమ్ఇండియాపై అతడు సరిగ్గా ఆడలేకపోతున్నాడని పేర్కొన్నారు. కరోనా నిబంధనలు, క్వారంటైన్ ఆంక్షలు అతడిపై ప్రభావం చూపించాయని వివరించాడు. ప్రస్తుత వైఫల్యానికి టెక్నిక్‌తో సంబంధం లేదని వెల్లడించారు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో స్టీవ్‌స్మిత్ బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు మొత్తంగా 10 పరుగులు సైతం చేయలేదు. ఇందులో రెండుసార్లు అశ్విన్‌కు చిక్కగా ఒకసారి బుమ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దాంతో టీమ్ఇండియా బౌలర్లపై అతడి టెక్నిక్ బాగాలేదని విమర్శలు వస్తున్నాయి.
"స్టీవ్‌స్మిత్ ప్రపంచస్థాయి ఆటగాడు. టీమ్ఇండియాతో సిరీసులో మాత్రం అలా కనిపించడం లేదు. నాలుగు నెలలుగా అతడు తన సతీమణి డానీకి దూరంగా ఉంటున్నాడు. కరోనా వైరస్ ఆంక్షల వల్ల క్వారంటైన్లో గడుపుతున్నాడు. తన భాగస్వామికి దూరంగా ఉండటం వల్ల స్మిత్ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. మూడో టెస్టులోనైనా అతడు బాగా ఆడాలని ఆశిస్తున్నా. స్మిత్ కాసేపు క్రీజులో నిలిస్తే చాలు పరుగులు అవే వస్తాయి"
- కిమ్ హ్యూస్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్