తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్​, కోహ్లీలను వెనక్కి నెట్టిన స్మిత్​ - australia vs england

ఆసీస్​ బ్యాట్స్​మెన్​ స్టీవ్​ స్మిత్​ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.యాషెస్​ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టులో కెరీర్​లో 25వ సెంచరీ నమోదు చేశాడు. ఈ మైలురాయిని తక్కువ ఇన్నింగ్స్​ల్లో సాధించిన రెండో బ్యాట్స్​మెన్​గా నిలిచాడు.

సచిన్​, కోహ్లీలను వెనక్కి నెట్టిన స్మిత్​

By

Published : Aug 4, 2019, 9:31 PM IST

Updated : Aug 4, 2019, 11:20 PM IST

ఆస్ట్రేలియా క్రికెటర్​ స్టీవ్​ స్మిత్​ టెస్ట్​ కెరీర్​లో మరో మైలురాయి సాధించాడు. ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో శతకం ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా టెస్టుల్లో వేగంగా 25 సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్​మెన్​గా ఘనత సాధించాడు. ఈ ఫీట్​ సాధించేందుకు 119 ఇన్నింగ్స్​లు తీసుకున్నాడీ కంగారూ బ్యాట్స్​మెన్. ఆస్ట్రేలియా​ దిగ్గజ ఆటగాడు డాన్​ బ్రాడ్​మన్​(68 ఇన్నింగ్స్​) అందరి కంటే ముందున్నాడు.

టెస్టుల్లో 25 సెంచరీలు పూర్తి చేయడానికి విరాట్​ 127 ఇన్నింగ్స్​లు తీసుకున్నాడు. భారత క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ 130 ఇన్నింగ్స్​ల్లో 25 శతకాలు చేశాడు.
తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్​ల్లోనూ శతకాలు చేసిన స్మిత్​.. ఈ ఘనత సాధించిన ఐదో ఆస్ట్రేలియా బ్యాట్స్​మెన్​గా పేరు తెచ్చుకున్నాడు.

ఇవీ చూడండి...సైనీ ఓ మంచి పేసర్​... భవిష్యత్​ స్టార్​: కోహ్లీ

Last Updated : Aug 4, 2019, 11:20 PM IST

ABOUT THE AUTHOR

...view details