తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్​ను వెనక్కి నెట్టిన స్మిత్​... లిటిల్ మాస్టర్​ స్పందన - steve smith double ton

ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్​ స్మిత్​.. యాషెస్​ సిరీస్​లో అదరగొడుతున్నాడు. నాలుగో టెస్టులో డబుల్​ సెంచరీ సాధించిన ఇతడిని మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ అభినందించాడు. పునరాగమనంలో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తున్నావని స్మిత్​పై ప్రశంసలు కురిపించాడు.

సచిన్​ను వెనక్కి నెట్టిన స్మిత్​... మాస్టర్​ స్పందన

By

Published : Sep 6, 2019, 2:44 PM IST

Updated : Sep 29, 2019, 3:43 PM IST

ఆస్ట్రేలియా స్టార్​ క్రికెటర్​ స్టీవ్​ స్మిత్​.. యాషెస్​ సిరీస్​లో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టులో డబుల్​ సెంచరీ సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో 26వ శతకం చేసిన స్మిత్​... క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ను అధిగమించాడు. తక్కువ ఇన్నింగ్స్​ల్లో 26 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మాస్టర్​ బ్లాస్టర్​ను దాటి రెండో స్థానంలో నిలిచాడు. ఈ విషయంపై సచిన్​ ట్వీట్​ చేశాడు.

" ప్రత్యర్థి అంచనా వేయలేని టెక్నిక్​, వాటిని కచ్చితంగా అమలు చేయగల దృష్టి స్టీవ్​ స్మిత్ సొంతం. అదే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. పునరాగమనం అద్భుతం" -సచిన్​ తెందూల్కర్​, దిగ్గజ క్రికెటర్​

సచిన్.. 136 ఇన్నింగ్స్​ల్లో 26 శతకాలు చేయగా.. స్మిత్​ 121 ఇన్నింగ్స్​ల్లోనే ఆ రికార్డు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. టాప్​​లో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్​ బ్రాడ్​మన్​ ఉన్నాడు. అతడు 69 ఇన్నింగ్స్​లోనే 26 శతకాలు బాదాడు. నాలుగు, ఐదు స్థానాల్లో సునీల్​ గవాస్కర్​(144), మాథ్యూ హెడెన్​(145) ఉన్నారు.

ఇదో రికార్డు..

టెస్టు ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో ఉన్న స్మిత్​.. తన పేరిట ఉన్న మరో రికార్డును తిరగరాశాడు. యాషెస్​లో వరుసగా ఎనిమిది 50కి పైగా స్కోర్లు సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఆఖరి ఎనిమిది ఇన్నింగ్స్​ల్లో 239, 76, 102*, 83, 144, 142, 92, 211 పరుగులు చేశాడు స్మిత్.

ఐదు టెస్టుల యాషెస్​ సిరీస్​లో తొలి మ్యాచ్​లో ఆస్ట్రేలియా గెలిచింది. రెండోది డ్రాగా ముగిసింది. ముడో టెస్టులో ఇంగ్లాండ్​ విజయం సాధించింది.

ఇదీ చదవండి:'టెస్టుల్లోనే స్మిత్​ పోటీ... అన్నింటా విరాట్ మేటి'​​

Last Updated : Sep 29, 2019, 3:43 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details