భారత్‌లో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. దీంతో పలువురు సెలబ్రిటీలు.. నెటిజన్లను ఇంట్లోనే ఉండమని కోరుతున్నారు. బయట తిరిగితే వైరస్ సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ఆదివారం కొవ్వుత్తులు వెలిగించి, ప్రజలు ఐక్యత చాటారు. కొందరు మాత్రం పటాస్‌లు కాల్చారు. దీనిపై స్పందించిన క్రికెటర్ రోహిత్ శర్మ.. ప్రపంచకప్‌నకు ఇంకా సమయముందని, ఇంట్లోని ఉండమని ప్రజలకు సూచించాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత టపాకాయలు కాల్చొచ్చని పరోక్షంగా చెబుతూ ట్వీట్ చేశాడు.
'ఇంట్లోనే ఉండండి.. ప్రపంచకప్‌నకు ఇంకా సమయముంది' - cricket news
కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండాలని సూచించాడు టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ. ఈ వైరస్‌ను అరికట్టేందుకు ఇప్పటికే రూ.80 లక్షలు విరాళమిచ్చాడీ ఓపెనర్.
రోహిత్ శర్మ
కరోనాను అరికట్టటంలో భాగంగా ఇప్పటికే రూ.80 లక్షలు విరాళం ప్రకటించాడు రోహిత్. ఈ వైరస్ ప్రభావంతో, మార్చి 29 నుంచి మొదలుకావాల్సిన ఐపీఎల్.. ఈ నెల 15కు వాయిదా పడింది. అయితే టోర్నీ జరిగేది లేనిది సందేహంగా మారింది. ఈ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు రోహిత్. ఇతడి సారథ్యంలో నాలుగుసార్లు విజేతగా నిలిచిందీ జట్టు.