ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహణకే సిద్ధంగా ఉన్నామని భారత క్రికెట్ బోర్డుకు తెలిపాయి పలు రాష్ట్రాల క్రికెట్ సంఘాలు. దేశవాళీ క్రికెట్ టోర్నీల నిర్వహణపై బుధవారంలోగా తమ అభిప్రాయాల్ని తెలపాలని బీసీసీఐ కోరగా రాష్ట్రాలు ఈ విధంగా స్పందించాయి.
'ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహణకు సై'
దేశవాళీ క్రికెట్ టోర్నీల నిర్వహణలో భాగంగా తొలుత ముస్తాక్ అలీ టీ 20 నిర్వహణకే తాము సిద్ధంగా ఉన్నట్లు పలు రాష్ట్రాలు బీసీసీఐకి తెలిపాయి. ముందుగా.. తమ అభిప్రాయం తెలపాలని బీసీసీఐ లేఖ రాయగా రాష్ట్రాలు ఈ విధంగా స్పందించాయి.
'ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహించేందుకు సిద్ధం'
దాదాపు చాలా రాష్ట్రాలు టీ20 నిర్వహణకే సిద్ధంగా ఉన్నట్లు తెలపగా కొన్ని సంఘాలు టీ20తో పాటు రంజీ ట్రోఫీ కూడా నిర్వహించే అవకాశమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాయి. మరికొన్ని సంఘాలు విజయ్ హజారే ట్రోఫీ నిర్వహణకు సిద్ధమని సంకేతాలిచ్చాయి. ఈ మేరకు కొన్ని రాష్ట్ర సంఘాలు బీసీసీఐ అధ్యక్షుడికి లేఖ రాశాయి. తొలుత టీ20 నిర్వహించి, తర్వాత ఇతర టోర్నీల నిర్వహణ గురించి ఆలోచించాలని కోరాయి. ఈ నిర్వహణలో భాగంగా బయో బబుల్ ఏర్పాట్ల గురించి కూడా యోచించాలని పేర్కొన్నాయి.