ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురుదెబ్బ. వెన్నముక, పక్కటెముక గాయంతో పేసర్ మిచెల్ స్టార్క్ మూడో వన్డేకు దూరమయ్యాడు. మరికొన్ని రోజుల పాటు అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారని ఆసీస్ కెప్టెన్ ఫించ్ వెల్లడించాడు.
ఆసీస్‌కు గాయాల బెడద.. వార్నర్‌తో పాటు మరో ఆటగాడు - starc injury
కంగారూ జట్టుకు గాయాల బెడద వేధిస్తోంది. ఇటీవల వార్నర్ గాయపడగా.. ఇప్పుడు స్టార్క్ కూడా ఇదే కారణంతో రానున్న మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
ఆసీస్‌కు గాయాల బెడద.. వార్నర్‌తో పాటు మరో ఆటగాడు
తొలి రెండు వన్డేల్లో అంతగా ఆకట్టుకోని స్టార్క్.. 20 ఓవర్లు వేసి 147 పరుగులు సమర్పించి, కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు.
వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. కానెబెర్రాలో జరుగుతున్న మూడో మ్యాచ్‌లోనూ గెలిచి, క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. దీని తర్వాత టీ20 సిరీస్, టెస్టు సిరీస్ ఇరుజట్ల మధ్య జరగనున్నాయి.