టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ త్వరలో అబుదాబి టీ10 లీగ్‌లో సందడి చేయనున్నాడు. ఇందులో మరాఠా అరేబియన్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. నవంబర్ 14 నుంచి ఆరంభం కానున్న ఈ టోర్నీకి ఇప్పటికే ఐసీసీ ఆమోదం ఉంది. ఈ లీగ్లోయువరాజ్అడుగుపెట్టడంపై ఇటీవల దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా హర్షం వ్యక్తం చేయగా... తాజాగా ఆసీస్ క్రికెటర్ బెన్ కట్టింగ్ కూడా ప్రశంసలు కురిపించాడు. టీ10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు బెన్ కట్టింగ్.
" ఈ లీగ్‌లో యువరాజ్ ఆడటం చాలా సంతోషంగా ఉంది. టీ20, వన్డే క్రికెట్లో ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు విదేశీ లీగుల్లో ఆడుతున్నాడు. యువీ ఆట కోసం అభిమానులు మ్యాచ్‌లకు పోటెత్తుతారు".
-- బెన్ కట్టింగ్, ఆసీస్ క్రికెటర్