తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెంచరీలు సాధించిన బ్యాట్​లు వేలానికి! - ఆర్సీబీ గ్రీన్​ జెర్సీలు వేలం

రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు విరాట్​ కోహ్లీ, ఏబీ డివిలియర్స్​ తాజాగా ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ సెషన్​లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి వినియోగించిన క్రికెట్​ సామాగ్రిని వేలం వేసి.. వాటి ద్వారా వచ్చిన నిధులను అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఉపయోగించనున్నట్లు తెలిపారు.

Star batsmen who are auctioning off centuries of bats
సెంచరీలు సాధించిన బ్యాట్​లు వేలానికి!

By

Published : Apr 25, 2020, 5:08 PM IST

Updated : Apr 25, 2020, 5:28 PM IST

కరోనాపై జరుగుతోన్న పోరాటానికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆ జట్టు ఆటగాడు ఏబీ డివిలియర్స్. 2016 ఐపీఎల్​ సీజన్​ ఓ మ్యాచ్​లో వినియోగించిన బ్యాట్లు, జెర్సీలను వేలం వేయాలనుకున్నారు. దాని ద్వారా వచ్చిన నిధులను విరాళంగా ఇవ్వాలనుకున్నట్లు తెలిపారు. శుక్రవారం ఇన్​స్టాగ్రామ్ చాట్​లో ఈ ఇద్దరు స్టార్​ బ్యాట్స్​మెన్లు చర్చించుకున్నారు.

2016 సీజన్​లో గుజరాత్ లయన్స్​పై మ్యాచ్​లో ఆకుపచ్చ జెర్సీలతో బెంగళూరు ఆటగాళ్లు బరిలో దిగారు. ఆ మ్యాచ్​లో కోహ్లీ, డివిలియర్స్ శతకాలతో అలరించారు. అందులో వినియోగించిన బ్యాట్​ల​ను వేలం వేయాలని డివిలియర్స్, కోహ్లీతో అన్నాడు. కోహ్లీ సంతకంతో ఉన్న జెర్సీ, ఇరువురి బ్యాట్​లు, గ్లవ్స్​ను వేలానికి ఇస్తానని డివిలియర్స్ తెలిపాడు. దీని ద్వారా వచ్చిన నిధులను అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఉపయోగించాలని పేర్కొన్నాడు. దీనికి కోహ్లీ స్పందిస్తూ.. అద్భుతమైన ఆలోచనంటూ డివిలియర్స్​ను ప్రశంసించాడు. వేలంలో వచ్చిన డబ్బును భారత్​, దక్షిణాఫ్రికాలో ఉన్న పేదల కోసం వినియోగిస్తామని వారు వెల్లడించారు.

ఇదీ చూడండి.. భజ్జీని ఇబ్బందిపెట్టిన బ్యాట్స్​మెన్​ వీరే!

Last Updated : Apr 25, 2020, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details