తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టాండ్‌బై జాబితాలో రిష‌బ్‌, రాయుడు, సైనీ - పేసర్ నవదీప్ సైనీ

ప్రపంచకప్​ స్టాండ్​బై జాబితాలో రిషబ్​, రాయుడు, నవదీప్ సైనీని ఎంపికచేసింది బీసీసీఐ. వరల్డ్​కప్​ భారత జట్టులో ఒకవేళ ఎవరైనా గాయపడితే వారి స్థానంలో ఈ ముగ్గురు ఆటగాళ్లను పరిశీలిస్తామని తెలిపింది బోర్డు.

స్టాండ్‌బై జాబితాలో రిష‌బ్‌, రాయుడు, సైనీ

By

Published : Apr 17, 2019, 9:26 PM IST

ప్రపంచకప్​ జట్టులో చోటు దక్కని రిషబ్​, రాయుడులకు కాస్త ఊరట లభించింది. స్టాండబై జాబితాలో వీరిద్దరితో పాటు పేసర్ నవదీప్ సైనీని ఎంపికచేసింది బీసీసీఐ. జట్టులో ఒక‌వేళ ఎవ‌రైనా గాయ‌ప‌డితే.. వారి స్థానంలో ఈ ముగ్గురు ఆటగాళ్లలో ఎవరికైనా అవకాశం దక్కవచ్చని తెలిపింది బోర్డు. మే12న ఐపీఎల్​ ముగిసిన అనంతరం ఆటగాళ్లు యోయో టెస్టులో సైతం పాసవ్వాల్సి ఉంది.

  1. ఇంగ్లండ్‌లో జ‌రిగే వ‌రల్డ్‌క‌ప్ కోసం కోహ్లీ సేన‌ను ఇటీవ‌ల బీసీసీఐ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 15 మంది స‌భ్యుల‌తో కూడిన బృందాన్ని సెలక్ట‌ర్లు ప్ర‌క‌టించారు. ఆ జట్టులో రిష‌బ్ పంత్‌, అంబ‌టి రాయుడుకు చోటు దక్కలేదు.
  2. మే 3ంన ప్రారంభం అయ్యే మెగా ఈవెంట్ కోసం ముగ్గురు ప్లేయ‌ర్ల‌ను బ్యాక‌ప్​గా ఎంపిక చేశారు. స్టాండ్​ బై జాబితాలో చోటు ఆశించిన ఖలీల్​, అవేశ్​, దీపక్​ చాహర్​కు నిరాశ ఎదురైంది.

ABOUT THE AUTHOR

...view details