'శ్రీశాంత్ వేటుపై పునఃసమీక్షించండి'
ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పేసర్ శ్రీశాంత్ వేటుపై సుప్రీంకోర్టు స్పందించింది. అతడికి విధించిన శిక్షపై పునఃసమీక్షించాలని బీసీసీఐ అంబుడ్స్‌మెన్ (స్వతంత్ర న్యాయాధికారి)కి సూచించింది.
'శ్రీశాంత్‌పై వేసిన శిక్షను ఓ సారి సమీక్షించండి'
స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిషేధం ఎదుర్కొంటున్న భారత పేసర్ శ్రీశాంత్‌కు శిక్ష తగ్గించే విషయమై పునఃసమీక్షించాలని సూచిస్తూ.. ఆ అధికారాన్ని బీసీసీఐ అంబుడ్స్‌మెన్‌కు అప్పగించింది సుప్రీంకోర్టు. 3 నెలల్లోగా ఈ విషయంపై బీసీసీఐ అంబుడ్స్‌మెన్ జస్టిస్ డీకే జైన్ నిర్ణయం తీసుకుంటారని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం వెల్లడించింది.
- 2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించాడీ ఆటగాడు.
- మార్చి 15న శిక్ష తగ్గించే విషయమై పునరాలోచించాలని బీసీసీఐకి అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అయితే ప్రస్తుతం ఇచ్చిన తీర్పు శ్రీశాంత్‌పై దిల్లీ హైకోర్టులో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై ఎటువంటి ప్రభావం చూపదని వ్యాఖ్యానించింది.