తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్​కు ఎదురుదెబ్బ- తొలి టెస్టు లంకదే - test championship

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆతిథ్య శ్రీలంక జట్టు. లంక సారథి కరుణరత్నె శతకంతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ప్రపంచ ఛాంపియన్​షిప్​లో తొలి విజయం నమోదు చేసుకున్నారు లంకేయులు.

కరుణరత్నె సెంచరీ.. కివీస్​పై శ్రీలంక విజయం

By

Published : Aug 18, 2019, 5:53 PM IST

Updated : Sep 27, 2019, 10:19 AM IST

న్యూజిలాండ్‌తో గాలేలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక సారథి కరుణరత్నె122 పరుగులతో లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా రెండు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా తొలి టెస్టును ఆరు వికెట్ల తేడాతో కైవసం చేసుకుంది లంక. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్​షిప్​లో ఖాతా తెరిచారు లంకేయులు.

కెప్టెన్​ ఇన్నింగ్స్​...

రెండో ఇన్నింగ్స్​లో 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక... నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 133/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంక.. ఆదిలోనే తిరమన్నె (64) వికెట్‌ కోల్పోయింది. అనంతరం కరుణరత్నె శతకంతో ఇన్నింగ్స్​ చక్కబెట్టాడు. మిగిలిన లక్ష్య ఛేదనలో కుశాల్‌ మెండిస్‌ (10) త్వరగానే ఔటైనా.. మాథ్యూస్‌ (28*), కుశాల్‌ పెరీరా (23), డిసిల్వా(14*) ఇన్నింగ్స్​ను​ ముగించారు. విజయంలో కీలక పాత్ర పోషించిన కరుణరత్నెకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.

న్యూజిలాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 249 పరుగులు చేయగా... శ్రీలంక 267 రన్స్​ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 285 పరుగులకే ఆలౌటైంది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది లంక జట్టు. ఆగస్టు 22 నుంచి కొలంబో వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.

Last Updated : Sep 27, 2019, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details