బుధవారం జరిగిన శ్రీలంక-వెస్టిండీస్ వన్డేలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ లంక.. నిర్ణీత ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 345 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇన్ని పరుగులు చేసినా, కనీసం ఒక్క సిక్సయినా నమోదు కాకపోవడం విశేషం. ఇంతకు ముందు 2011లో ఆసీస్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్.. సిక్సర్ లేకుండా 333 పరుగులు చేసింది. ఇప్పుడు లంక జట్టు ఈ రికార్డును తిరగరాసింది.
ఒక్క సిక్సయినా కొట్టకుండా భారీ స్కోరు నమోదు - sports news
వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో శ్రీలంక బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేసినా, ఒక్క సిక్సయినా కొట్టకపోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో161 పరుగుల తేడాతో లంక ఘనవిజయం సాధించింది.
శ్రీలంక వెస్టిండీస్ మ్యాచ్
వెస్టిండీస్ జరిగిన ఈ మ్యాచ్‌లో లంక.. 161 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో అవిష్క ఫెర్నాండో(127), కుశాల్ మెండిస్(119) సెంచరీలతో అదరగొట్టారు. తిశారా పెరీర్(36) ఫర్వాలేదనిపించాడు. విండీస్ జట్టుకు చెందిన ఫాబియన్ అలెన్ మాత్రమే సిక్స్ కొట్టాడు.
Last Updated : Mar 2, 2020, 5:14 PM IST