పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ బౌలర్‌గా పేరున్న ఆటగాడు లసిత్ మలింగ. ఈ ఏడాది జులైలోనే వన్డేలకు వీడ్కోలు పలికాడీ స్టార్ బౌలర్. చివరగా సెప్టెంబర్ 6న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఈ 36 ఏళ్ల పేసర్... 4 బంతుల్లో 4 వికెట్లు తీశాడు. ఎన్నో రికార్డులు సాధించిన ఈ ఆటగాడు.. ఎందరో యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. అతడి జుట్టుతోనూ, బౌలింగ్ శైలితోనూ ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. అలాంటి క్రికెటర్‌కు ఏకలవ్య శిష్యుడిగా వస్తున్నాడు.. శ్రీలంకకు చెందిన 17 ఏళ్ల యువ క్రీడాకారుడు మతీశ పతిరన.
వావ్ అనిపించే ఆరంభం...
తాజాగా కళాశాల స్థాయిలో అరంగేట్ర మ్యాచ్‌లో.. 7 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీశాడు మతీశ పతిరన. ట్రినిటీ కళాశాల తరఫున బరిలో దిగిన ఈ యువ క్రికెటర్ అచ్చం మలింగ బౌలింగ్ శైలినే అనుకరిస్తూ ఆశ్చర్యపరిచాడు. లసిత్ తరహాలోనే యార్కర్లతో బ్యాట్స్మెన్లను బెంబేలెత్తించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇతడి ఆటతీరు చూస్తుంటే లంక జెర్సీ త్వరలోనే ధరిస్తాడని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
- వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో లంక బౌలర్‌గా నిలిచాడు మలింగ. 220 ఇన్నింగ్స్‌ల్లో 338 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇతడి కంటే ముందు మరళీధరన్ (523), చమింద వాస్(399) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
- వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో (2007లో దక్షిణాఫ్రికాపై, 2011లో కెన్యాపై) హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు మలింగ. 2011లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు.
ఇవీ చూడండి...