తెలంగాణ

telangana

ETV Bharat / sports

గవర్నర్​గా అవతారమెత్తనున్న శ్రీలంక క్రికెట్ లెజెండ్​..! - Muttiah Muralitharan rajapaksa

శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్​ గవర్నర్​ కాబోతున్నాడా..! అంటే అవుననే అంటున్నాయి ఆ దేశ మీడియా వర్గాలు. ఇటీవలే శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గొటబాయ రాజపక్స.. ఉత్తర ప్రావిన్స్​కు గవర్నర్​గా బాధ్యతలు చేపట్టాలని మురళీధరన్​ను  వ్యక్తిగతంగా అడిగినట్లు సమాచారం.

Sri Lankan spin king Muralitharan to be appointed as governor of Northern Province
గవర్నర్​గా అవతారమెత్తనున్న శ్రీలంక క్రికెట్ లెజెండ్​..!

By

Published : Nov 27, 2019, 5:24 PM IST

క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసి ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్​గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్.. ఇకపై ప్రజాపాలనకు సిద్ధమవనున్నారని సమాచారం. శ్రీలంక ఉత్తర ప్రావిన్స్​ గవర్నర్​గా మురళీధరన్​ బాధ్యతలు చేపట్టనున్నారని ఆ దేశ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

గవర్నర్​ పదవి చేపట్టాల్సిందిగా శ్రీలంక క్రికెట్​ లెజెండ్​ను ఆదేశ నూతన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. వ్యక్తిగతంగా ఆహ్వానించారట. తమిళులు ఎక్కువగా ఉన్న ఉత్తర​ ప్రావిన్స్​కు గవర్నర్​గా ఉండాలని రాజపక్స కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఉత్తర ప్రావిన్స్​కు మురళీధరన్​ గవర్నర్​ నియామితులైతే... తూర్పు ప్రావిన్స్​కు అనురాధా యహంపత్, నార్త్ సెంట్రల్​కు తిసా వితరాణా.. గవర్నర్​గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

2011లో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన ముత్తయ్య.. టెస్టుల్లో అత్యధిక వికెట్లు(800) తీసిన బౌలర్​గా రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 534 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 2005 మార్చిలో చెన్నైకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియా నూతన సెలక్టర్​గా బెయిలీ నియామకం

ABOUT THE AUTHOR

...view details