మాదక ద్రవ్యాల కేసులో శ్రీలంక అంతర్జాతీయ క్రికెటర్ మధుషంక అరెస్టయ్యాడు. తమ దేశంలో కర్ఫూ అమల్లో ఉన్నా సరే కారులో వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డాడు మధుషంక. ఆ సమయంలో అతడి వద్ద రెండు గ్రాముల హెరాయిన్ ఉందని వారు తెలిపారు. ఫలితంగా మేజిస్ట్రేట్ రెండు వారాల కస్టడీ విధించారు.
డ్రగ్స్ కేసులో లంక క్రికెటర్ అరెస్ట్ - శ్రీలంక క్రికెటర్ మధుశంక వార్తలు
హెరాయిన్‌తో పట్టుబడ్డ లంక క్రికెటర్ షెహన్ మధుషంకకు రెండు వారాల కస్టడీ విధించారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.
లంక క్రికెటర్ షెహన్ మధుషంక
2018లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మధుషంక.. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో హ్యాట్రిక్ వికెట్లు తీసి అందరి దృష్టి ఆకర్షించాడు. అదే ఏడాది నుంచి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.