సెక్యూరిటీ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం చేసిన శ్రీలంక జట్టు ఎట్టకేలకు పాకిస్థాన్ బయలుదేరింది. భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన లేదని తెలిపింది.
2009 లాహోర్ పేలుడు తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వెళ్లడానికి చాలా జట్లు విముఖత వ్యక్తం చేశాయి. ఫలితంగా తమ మ్యాచ్లను యూఏఈకి మార్చుకుంది పాక్. కానీ స్వదేశంలో సిరీస్ల నిర్వహణకు పట్టుబట్టిన పీసీబీ ఎట్టకేలకు విజయం సాధించింది. పాక్ గడ్డపై ఆడేందుకు లంకను ఒప్పించింది.
షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 27నుంచి పాక్తో మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ప్రారంభంకానుంది. ఇందుకోసం పాక్ వెళ్లడానికి ముఖం చాటేసిన లంక ఆటగాళ్లు తాజాగా అందుకు సిద్ధమయ్యారు.