2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఫిక్సింగ్ జరిగిందని.. శ్రీలంక మాజీ క్రీడాశాఖ మంత్రి మహిందానంద అలుతగమగే ఆరోపించారు. ఆ మ్యాచ్‌లో భారత్‌కు శ్రీలంక కప్పు అమ్మేసిందనే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకున్నారు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో తమ జట్టు గెలవాల్సి ఉన్నా, కావాలనే ఓడిపోయిందని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అదే మ్యాచ్‌కు కామెంటరీ చేసిన రణతుంగ.. గతంలో మాట్లాడుతూ, ఇప్పటికీ తనకు ఆ ఫైనల్‌పై సందేహాలున్నాయని తెలిపాడు. ఆరోజు ఏం జరిగిందో దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు పేర్కన్నాడు. లేకపోతే తానే ఆ విషయాల్ని వెల్లడిస్తానని అన్నాడు.