అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు శ్రీలంక స్టార్ పేసర్ నువాన్ కులశేఖర. లంక తరఫున చమిందా వాస్, లసిత్ మలింగ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఈ ఫాస్ట్‌బౌలర్ ఆటకు గుడ్‌బై చెప్పేశాడు.
అప్పట్లో హీరో...
2014లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మంచి ప్రతిభ కనబరిచాడు కులశేఖర. 6 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది వికెట్లు తీశాడు. 6.42 బౌలింగ్ ఎకానమీతో రాణించి ఆ దేశం కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
- 2009 మార్చిలో ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు కులశేఖర. బ్రిస్బేన్ వేదికగా 2013లో ఆసీస్‌తో జరిగిన పోరులో 22 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడి వన్డే కెరీర్లో ఇదే అత్యుత్తమం.
- 15 ఏళ్ల కెరీర్లో నువాన్ 184 వన్డేల్లో 199 వికెట్లు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడి 66 వికెట్లు తీశాడు. ఈ 37 ఏళ్ల క్రికెటర్ 21 టెస్టులే ఆడినా 48 వికెట్లు తీశాడు.