కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ నిరవధిక వాయిదా పడింది. ఇప్పటికే భారత్‌లో లాక్డౌన్ కారణంగా మిగలిన క్రీడా టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశం లేదని బీసీసీఐ వెల్లడించింది. అయితే ఈ క్రికెట్ లీగ్‌ను నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ తెలిపారు.
" భారత్ కంటే శ్రీలంకలో కరోనా ప్రభావం తొందరగా తగ్గుతుందని అనుకుంటున్నాం. అందువల్ల ఐపీఎల్‌ను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. దీనిపై బీసీసీఐకి త్వరలోనే లేఖ రాస్తాం."