శ్రీలంక ఛీఫ్ సెలక్టర్ పదవికి అశాంత డి మెల్ రాజీనామా చేశారు. స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో లంక.. 0-2తో ఓటమి పాలైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ శ్రీలంక ధ్రువీకరించింది.
శ్రీలంక ఛీఫ్ సెలక్టర్ రాజీనామా.. కారణమిదే - అశాంత డి మెల్
శ్రీలంక క్రికెట్ ఛీఫ్ సెలక్టర్ పదవి నుంచి వైదొలిగారు అశాంత డి మెల్. సొంతగడ్డపై ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో లంక క్లీన్ స్వీప్ అయిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

శ్రీలంక ఛీఫ్ సెలక్టర్ రాజీనామా.. అదే కారణం
అశాంత సేవలకు గానూ కృతజ్ఞతలు తెలిపింది లంక క్రికెట్ బోర్డు. మరోవైపు జట్టు మేనేజర్ గానూ అశాంత వైదొలిగారు.
ఇదీ చూడండి:మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దోషిగా లంక మాజీ క్రికెటర్