తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​ కొత్త ఆటగాళ్లను పరిచయం చేసిన లక్ష్మణ్ - సన్ రైజర్స్ కొత్త ఆటగాళ్లు

ఐపీఎల్ కోసం సిద్ధమవుతోంది సన్​రైజర్స్ హైదరాబాద్. ఈ సందర్భంగా సీజన్​లో కొత్త ఆటగాళ్లను పరిచయం చేశాడు జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్. అందులో హైదరాబాద్​కు చెందిన సందీప్ భవనక కూడా ఉన్నాడు.

సన్​రైజర్స్​ కొత్త ఆటగాళ్లను పరిచయం చేసిన లక్ష్మణ్
సన్​రైజర్స్​ కొత్త ఆటగాళ్లను పరిచయం చేసిన లక్ష్మణ్

By

Published : Aug 29, 2020, 9:24 AM IST

ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం గత ఆదివారం దుబాయ్‌కి చేరుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ క్వారంటైన్‌ గడువును పూర్తి చేసుకుంది. దీంతో ఆటగాళ్లంతా ఔట్‌డోర్‌లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టనున్నారు. అయితే, శుక్రవారం సన్‌రైజర్స్‌ మెంటార్‌, టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ ఏడాది తమ జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లను పరిచయం చేశాడు. అందులో హైదరాబాద్‌కు చెందిన సందీప్‌ భవనక కూడా ఉన్నాడు.

రేపటి నుంచే ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెడుతుందని, టోర్నమెంట్‌ ప్రారంభమైందంటే ఇక వరుస మ్యాచ్‌లతో బిజీగా ఉంటామని తెలిపాడు లక్ష్మణ్. ఈ సందర్భంగా ఆటగాళ్లంతా ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉండాలని, ఇదివరకు ఎస్‌ఆర్‌హెచ్‌ ఎలా ఉందో అలాగే కొనసాగాలని సూచించాడు. అనంతరం కొత్త ఆటగాళ్లని పరిచయం చేసుకోమని చెప్పాడు.

కొత్త ఆటగాళ్లు ఎవరు.. ఏమన్నారు?

  • అబ్దుల్‌ సమద్‌.. జమ్మూ కశ్మీర్‌ నుంచి వచ్చాను. ఇదే నా తొలి ఐపీఎల్‌ టోర్నీ. ఈ సీజన్‌ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఇక్కడి కోచ్‌లతో పాటు చాలా మంది సీనియర్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోగలనని అనుకుంటున్నా.
  • భవనక సందీప్‌.. హైదరాబాద్‌ నుంచి వచ్చాను. ఈ సీజన్‌ ఆరంభం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. జట్టు నా నుంచి ఏదైతే ఆశిస్తుందో అదే నా తొలి ప్రాధాన్యతగా ఉంటుంది. అందుకోసం కృషిచేస్తా.
  • ప్రియమ్‌ గార్గ్‌.. ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి. నేనెంతో ఉత్సుకతతో ఉన్నా. ఎందుకంటే ఇదే నా తొలి ఐపీఎల్‌. అవకాశం కోసం వేచి ఉన్నా.

ABOUT THE AUTHOR

...view details