సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎక్కువ మంది డెత్ ఓవర్ స్పెషలిస్టు బౌలర్లు ఉన్నారని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. భువనేశ్వర్ కుమార్, లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్లు డెత్ ఓవర్లలో ప్రత్యర్థికి ధీటుగా బదులిస్తారని తెలిపాడు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన వార్నర్ తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వికెట్ కీపర్ బెయిర్ స్టోతో ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్ సెషన్లో పాల్గొన్నాడు. నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు వారిద్దరూ సమాధానమిచ్చారు.
డెత్ ఓవర్ స్పెషలిస్టులు ఉన్నారు జాగ్రత్త!
ఐపీఎల్లో అత్యుత్తమ డెత్ ఓవర్ స్పెషలిస్టు బౌలర్లు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోనే ఉన్నారని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులకు వారు ధీటుగా బదులిస్తారని తెలిపాడు. ఈ విషయాన్ని ఇన్స్టా లైవ్ సెషన్లో తాజాగా వెల్లడించాడు.
డెత్ ఓవర్ స్పెషలిస్టులు ఉన్నారు జాగ్రత్త!
"మా జట్టులో ఉత్తమ ఆటగాళ్లు ఉన్నారు. డెత్ ఓవర్ స్పెషలిస్టు బౌలర్లు ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. టోర్నీలో ఉన్న అన్ని జట్లకు ధీటుగా పోటీనిచ్చే అత్యుత్తమ బౌలింగ్ లైనప్ మాకు ఉంది" అని డేవిడ్ వార్నర్ అన్నాడు.