మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న టీమ్ఇండియా పేసర్ శ్రీశాంత్ శిక్షా కాలం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన అతడు.. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఇకపై ఆటకు అందుబాటులో ఉంటానని చెప్పాడు. త్వరలోనే దేశవాళీ క్రికెట్ కెరీర్‌ను మళ్లీ ప్రారంభిస్తానని తెలిపాడు. టీమ్ఇండియాలోనూ తిరిగి స్థానం దక్కించుకుంటాననే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నాడు.
"ఇప్పుడు నాపై ఉన్న నిషేధం పూర్తిగా తొలగిపోయింది. ఇకపై నాకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను ఆడగలను. ఏ జట్టు తరఫున ఆడినా నా వంతు ప్రయత్నంగా బాగా రాణిస్తాను".
-శ్రీశాంత్, టీమ్ఇండియా పేసర్.