ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు టీమ్ఇండియా పేసర్ శ్రీశాంత్. 2013 తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది జరగనున్న రంజీ ట్రోఫీలో పాల్గొనడం సహా ఐపీఎల్‌లోనూ ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్నట్లు తాజాగా వెల్లడించాడు.
"2021 ఐపీఎల్ వేలంలో కచ్చితంగా పాల్గొంటా. ఏ జట్టు తీసుకున్నా నా మెరుగైన ప్రదర్శన చేస్తా. కానీ, క్రికెట్ అభిమానిగా చెప్పాలంటే ముంబయి ఇండియన్స్ జట్టుకు సచిన్ తెందూల్కర్ ఆధ్వర్యంలో ఆడాలని ఉంది. ముంబయి జట్టులో ఆడే అవకాశం లభిస్తే సచిన్ దగ్గర విలువైన సలహాలు తీసుకునే వీలుంటుంది".