కొన్ని నెలలుగా లాక్డౌన్ సమయాన్ని తమకు నచ్చిన వ్యాపకాలతో గడిపేస్తున్నారు క్రికెటర్లు. ఈ ఖాళీ సమయంలో తమకు ఇష్టమైన ఆటగాళ్లతో ఓ అత్యుత్తమ జట్టును తయారు చేస్తున్నారు. తాజాగా టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ శ్రీశాంత్ కూడా ఓ ప్రపంచ ఎలెవన్‌ను రూపొందించాడు. ఈ జట్టుకు మాజీ భారత సారథి సౌరభ్ గంగూలీని కెప్టెన్‌గా నియమించాడు.
అయితే గంగూలీ కెప్టెన్సీలో శ్రీశాంత్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కానీ తన సారథ్యంలో దూకుడు ఉంటుందని అందుకే గంగూలీని కెప్టెన్‌గా ఎంచుకున్నట్లు తెలిపాడు శ్రీశాంత్. గంగూలీకి ఓపెనింగ్ జోడీగా సచిన్ తెందూల్కర్‌ను ఎంపిక చేశాడు. మూడు, నాలుగో స్థానంలో బ్రియన్ లారా, విరాట్ కోహ్లీను తీసుకున్నాడు. మిడిలార్డర్లో డివిలియర్స్, యువరాజ్ సింగ్, ధోనీ (కీపర్)లకు చోటు కల్పించాడు. తర్వాత జాక్వెస్ కలిస్‌ను ఎంచుకున్నాడు. బౌలింగ్ విభాగానికి వస్తే షేన్ వార్న్, అలెన్ డోనాల్డ్, మెక్‌గ్రాత్‌ల పేర్లు తెలిపాడు.