దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు పలువురు మాజీలు, వర్ధమాన ఆటగాళ్లు. దేశంపై తమకున్న అభిమానాన్ని చాటి చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.
"ఈరోజు మనం ఏం చేస్తామో దానిపైనే భవిష్యత్ ఆధారపడి ఉంది. దేశం ఉన్నత శిఖరాలకు చేరడానికి మనమంతా కలిసి కట్టుగా ఉందాం. ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.'
-విరాట్ కోహ్లీ
"ఈ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశాభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్. ఈ విపత్కర సమయంలో మనమందరం తోటివారికి అండగా నిలుద్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే."
-సురేశ్ రైనా
"ఉదయాన్నే మా ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగరవేసి గణతంత్ర వేడుకల్ని చేసుకున్నాను. ప్రతిఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు."
-కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడామంత్రి
" అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, వేడుకలు జరుపుకొన్నాక ఎవరూ జాతీయ జెండాలను రోడ్లపై పడేయొద్దని విజ్ఞప్తి."
-వీరేంద్ర సెహ్వాగ్
"భారత్ అంటే ప్రేమ, గర్వం, ఇష్టం.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు."
-రోహిత్ శర్మ
"అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత దేశం పాటిస్తున్న విలువలు..మనకు మార్గనిర్దేశం చూపే కాంతిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా".