ముంబయిలో ఉగ్రదాడి జరిగి నేటికి 11 ఏళ్లయిన నేపథ్యంలో క్రీడా సమాజం బాధితులకు నివాళులు అర్పించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సచిన్ తెందూల్కర్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే తదితరులు ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు.
"26/11 ఉగ్రదాడిలో అసువులు బాసిన అమాయక ప్రజల ధైర్యాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. వాళ్లు వెళ్లిపోవచ్చు.. కానీ మర్చిపోకూడదు" -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్.
"ఇది జరిగి 11 ఏళ్లయినప్పటికీ, ఆ దాడిలో అమరులైన పోలీసులు, సైనికులను ఎప్పటికీ మర్చిపోకూడదు. దేశ ఖ్యాతిని, మానవత్వాన్ని పెంచేందుకు వాళ్లు ప్రాణాలర్పించారు. బాధిత కుటుంబాలను చూస్తుంటే నా హృదయం చలించిపోతోంది" -సచిన్ తెందూల్కర్
"ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా మౌనం పాటిస్తున్నా. మనల్ని కాపాడటం కోసం వారు అమరులయ్యారు" -చతేశ్వర్ పుజారా, టీమిండియా క్రికెటర్
"26/11 దాడి జరిగినపుడు నగరం ఎలా ఉందో ఇప్పటికీ గుర్తుంది. భద్రతా బలగాలు ధైర్య సాహసాలకు వారిని గౌరవించాల్సిందే" -అజింక్య రహానే