మైదానంలో ప్రదర్శించే ఆటతీరుతో మాత్రమే క్రీడాకారుడికి గుర్తింపు వస్తుందని లెజండరీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ అన్నాడు. కానీ, ఆటగాడి నేపథ్యం చూసి గుర్తింపు రాదని చెప్పాడు. దేశంలో ఏ మూల నుంచి వచ్చినా.. డ్రస్సింగ్‌రూమ్‌లో అడుగుపెట్టిన తర్వాత ఆటగాడి ప్రదర్శన తప్ప.. మిగిలిన వాటి గురించి ఎవరూ పట్టించుకోరని చెప్పాడు.
అన్-అకాడమీ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌కు ప్రచారకర్తగా సచిన్ ఎంపికైన తర్వాత వర్చువల్‌గా విద్యార్థులతో మాట్లాడాడు.
"కెరీర్లో నాకు దక్కిన అనుభవాలను పంచుకోవాలనుకున్నా. దీని కోసం ఆన్లైన్ ఉచిత సెషన్లు నిర్వహించున్నాం. అందులో ఎవరైనా చేరవచ్చు. గతంలో నేను చాలామంది పిల్లలతో ప్రత్యక్షంగా సంభాషించాను. కానీ, డిజిటల్ వేదికగా మాట్లాడడం ఇదే మొదటిసారి. ఇది కొంతమందికే పరిమితం కాదు. కొన్ని వందలు నుంచి మిలియన్లు వరకు వెళుతుంది. నేర్చుకోవాలనే లక్ష్యంతో మీరు నన్ను ఎన్నో ప్రశ్నలు అడగొచ్చు".