భిన్న సారథ్యం భారత సంస్కృతికి నప్పదని టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్‌దేవ్ అన్నాడు. 'ఒక బహుళ జాతి కంపెనీకి ఇద్దరు సీఈఓలు ఉండరు' అని వ్యాఖ్యానించాడు. ముంబయి ఇండియన్స్‌కు రోహిత్‌శర్మ అయిదో టైటిల్ అందించినప్పటి నుంచి టీమ్‌ఇండియాకు భిన్న సారథులు ఉండాలన్న చర్చ ఊపందుకుంది. టీ20 జట్టు సారథ్యమైనా రోహిత్‌కు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో కపిల్ ఇలా అన్నాడు.
ఇద్దరు కెప్టెన్లు ఉంటే సమస్యలొస్తాయి: కపిల్ - టీమ్‌ఇండియా భిన్న సారథ్యంపై కపిల్ దేవ్
టీమ్‌ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉంటే జట్టులో సమస్యలు తలెత్తుతాయన్నాడు భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్. ఈ పద్ధతితో కొత్త సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డాడు.
కపిల్ దేవ్.
"మన సంస్కృతికి భిన్న సారథ్యం నప్పదు. ఒక కంపెనీకి ఇద్దరు సీఈఓలను నియమిస్తామా? మూడు ఫార్మాట్లలో 70 నుంచి 80 శాతం ఒకటే జట్టు. సారథులు విరుద్ధమైన పద్ధతులు అవలంబిస్తే వారికి నచ్చవు. ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఇద్దరు సారథులు ఉంటే జట్టు వాతావరణం మారిపోతుంది. ఫలానా వ్యక్తి టెస్టుల్లో సారథి కాబట్టి అతడికి కోపం తెప్పించకూడదు అని ఆటగాళ్లు ఆలోచిస్తారు" అని కపిల్ చెప్పాడు.
ఇదీ చూడండి :కపిల్ దేవ్, భార్య రోమికి ఎలా ప్రపోజ్ చేశారంటే?