మహిళా టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించి, కప్పు గెలుచుకుంది. మెల్బోర్న్ మైదానంలో జరిగిన ఈ పోరుకు దాదాపు 86 వేలమందికి పైగా వీక్షకులు హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన ఓ వ్యక్తికి కరోనా ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
మహిళా ప్రపంచకప్ ఫైనల్‌కు వచ్చిన అభిమానికి కరోనా - melbourne cricket ground
మహిళా టీ20 ప్రపంచకప్ తుదిపోరు చూసేందుకు వచ్చిన ఓ అభిమానికి కరోనా ఉన్నట్లు తేలింది. ఎవరికైనా అలాంటి లక్షణాలు కనిపిస్తే సంప్రదించాలని అధికారులు ఆదేశించారు.
స్టేడియంలోని లెవల్ 2 నార్త్ స్టాండ్‌లో కూర్చున్న ఓ అభిమానికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో అక్కడ కూర్చున్న మిగతావారు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని అధికారులు ఆదేశించారు.
ఈ వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే పలు టోర్నీలు వాయిదా పడుతుండగా, మరికొన్ని ప్రేక్షకుల లేకుండానే నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 70కి చేరుకుంది. ఈ కారణంగానే ఐపీఎల్ నిర్వహణపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.