భారత యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 146/6 వద్ద జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన ఈ యువ కెరటం.. పంత్, అక్షర్‌తో కలిసి శతక భాగస్వామ్యాలు నిర్మించాడు. టీమ్ఇండియా ఆధిక్యంలో కీలక పాత్ర పోషించాడు.
174 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 96 పరుగులు చేసిన సుందర్.. తనదైన శైలిలో కళాత్మక షాట్లు ఆడాడు. ఇంగ్లింష్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. డిఫెన్స్‌కు ప్రాధాన్యమిస్తూనే.. చూడముచ్చటైన షాట్లతో ఆలరించాడు. గ్రౌండ్ నలుమూలలా పరుగులు సాధించాడు. క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
అయితే అప్పటివరకు సాఫీగానే సాగుతున్న సుందర్ ఇన్నింగ్స్‌ను అక్షర్ రనౌట్ మలుపు తిప్పింది. ఆ తర్వాత వచ్చిన ఇషాంత్, సిరాజ్‌లు వెంటవెంటనే ఔట్ అయ్యారు. దీంతో ఈ యువ ఆటగాడికి సెంచరీ చేసే అవకాశం కొద్దిలో చేజారింది. శతకం మిస్ అయినప్పటికీ.. జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడిన సుందర్.. సెంచరీ చేసినట్లే లెక్క!