ఐపీఎల్లో పాల్గొనేందుకు క్రికెటర్లు, ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. అయితే వారికి వైద్యపరీక్షల్లో నెగటివ్ వచ్చినా సరే, ఆ తర్వాత వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలా? సరిగ్గా ఇదే విషయమై ఆలోచించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్.. జట్టు సభ్యులు ధరించేందుకు ప్రత్యేక కిట్‌ను పంజాబ్ జలంధర్‌లో తయారు చేయించింది. 99.9 శాతం కరోనా రాకుండా ఇది నిరోధిస్తుందని సదరు సంస్థే వెల్లడించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లకు ప్రత్యేక కిట్
కొవిడ్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లకు పూర్తి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక కిట్‌ను తయారు చేశారు. ఇది 99.9 శాతం వైరస్‌ను నిరోధించగలుగుతుందని సదరు సంస్థ వెల్లడించింది.
sunrisers hyderabad
కరోనా ప్రభావం ఎక్కువ కావడం వల్ల భారత్‌లో జరగాల్సిన ఐపీఎల్.. ఈ ఏడాది దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబరు 19 నుంచి నవంబర్ 10 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇప్పటికే జట్లలోని ఆటగాళ్లందరూ ఆరు రోజుల క్వారంటైన్ ముగించుకుని ప్రాక్టీసు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో దుబాయ్‌లో కరోనా కేసులు కూడా పెరుగుతుండటం కాస్త కలవరపరిచే విషయం.