తెలంగాణ

telangana

ETV Bharat / sports

రూ.కోటి ఖర్చుతో ఆ క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానం - ఐపీఎల్​ 2020 న్యూస్​

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ ఆటగాళ్లను యూఏఈ రప్పించేందుకు ఐపీఎల్​ ఫ్రాంచైజీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఏడు జట్ల యాజమాన్యాలు కలిసి రూ.కోటి వ్యయంతో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.

special jet for England, Australia cricketers to play IPL
రూ.కోటి ఖర్చుతో ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానం

By

Published : Sep 9, 2020, 7:50 AM IST

ఐపీఎల్​లో బరిలో దిగే ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా ఆటగాళ్లను త్వరగా.. సురక్షితంగా యూఏఈకి రప్పించేందుకు ఏడు ఫ్రాంచైజీలు ఏకమయ్యాయి. 22 మంది ఆటగాళ్లను మాంచెస్టర్​ నుంచి దుబాయ్​ తీసుకొచ్చేందుకు ఏడు ఫ్రాంఛైజీలు కలిసి రూ.కోటి ఖర్చుతో ప్రత్యేక విమానాన్ని బుక్​ చేశాయి. ముంబయి ఇండియన్స్​ మినహా మిగతా జట్టు యాజమాన్యాలు తమ విదేశీ ఆటగాళ్ల ప్రయాణం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నాయి. శానిటైజ్​ చేసిన బస్సులో మాంచెస్టర్​లోని స్టేడియం నుంచి విమానశ్రయానికి ఆటగాళ్లను తీసుకొస్తారు. ఇంగ్లాండ్​ బయో బబుల్​లో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్​ బస్సు నడిపిస్తాడు. ఇమిగ్రేషన్​లోనూ ఆటగాళ్లను ఎక్కువసేపు ఆపరు. ప్రత్యేక విమానాన్ని కూడా శానిటైజ్​ చేస్తారు.

దుబాయ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాకుండా వేరే చోట విమానాన్ని దింపుతారు. అనంతరం ఆయా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్తాయి. ఆటగాళ్లను ఒక బయో బబుల్​ నుంచి ఇంకో బబుల్​లోకి తీసుకురావడం ద్వారా ఆరు రోజుల క్వారంటైన్​ సమయం తప్పుతుందని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అయితే క్వారంటైన్​ విషయంలో రాజీపడేది లేదని బీసీసీఐ అధికారి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details