తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: దక్షిణాఫ్రికా తరఫున తాహిర్​ సెంచరీ..! - south africa

దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో 100 మ్యాచ్​లు ఆడిన రెండో స్పిన్నర్​గా రికార్డుల కెక్కాడు ఇమ్రాన్ తాహిర్. లండన్ ఓవల్ వేదికగా​ బంగ్లాదేశ్ - దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్​తో ఈ ఘనత సాధించాడు.

తాహిర్

By

Published : Jun 2, 2019, 5:56 PM IST

బంగ్లాదేశ్​తో జరుగుతున్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ అరుదైన ఘనత సాధించాడు. ప్రొటీస్ జట్టు తరఫున 100వ మ్యాచ్​ ఆడుతున్న రెండో స్పిన్నర్​గా రికార్డుల కెక్కాడు. ఇంతకుముందు నిక్కీ బోజే వంద వన్డేలాడాడు.

"ఎంతో ఆనందంగా ఉంది. 2011లో తొలి మ్యాచ్ ఆడాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంది. దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా". -ఇమ్రాన్ తాహిర్​, దక్షిణాఫ్రికా బౌలర్​

2011 ప్రపంచకప్​లో సఫారీ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు తాహిర్. ఇప్పటివరకు 4.66 ఎకానమీ రేట్​తో 164 వికెట్లు తీశాడు. అంతేకాకుండా వేగంగా 100 వికెట్లు తీసిన ప్రొటీస్​ బౌలర్​గా రికార్డుల కెక్కాడు.

ఈ ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో రెండో బంతికే బెయిర్​ స్టోను ఔట్ చేశాడు. పాకిస్థాన్​ లాహోర్​లో జన్మించిన తాహిర్ ఆ దేశం తరఫున దేశవాళీ మ్యాచ్​లు ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇవీ చూడండి.. WC19: కోహ్లీ ఫిట్​.. అభిమానులు హ్యాపీ

ABOUT THE AUTHOR

...view details