భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు ఆడనుంది దక్షిణాఫ్రికా. ఈనెల 12న ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో పాల్గొనేందుకు 16మందితో కూడిన సఫారీ జట్టు.. తాజాగా దిల్లీ చేరుకుంది. ధర్మశాల వేదికగా జరగబోయే తొలివన్డే కోసం ఇరుజట్లు.. రేపు(మంగళవారం) అక్కడికి వెళ్లనున్నాయి.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్య పరీక్షల అనంతరం ఫిట్నెస్ను పరీక్షించుకోనున్నారు టీమిండియా క్రికెటర్లు.
ఈ సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఈనెల 15న లఖ్‌నవూలో, మూడో వన్డే 18న కోల్‌కతాలో జరగనుంది.
ఇటీవలే కివీస్ పర్యటనలో టీ20 సిరీస్ గెల్చుకుని.. టెస్టు, వన్డే సిరీస్‌ల్లో వైట్‌వాష్‌కు గురైంది టీమిండియా. అయితే సఫారీలతో జరిగే మ్యాచ్‌ల్లో తిరిగి ఫామ్‌లోకి రావాలని భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుని జోరుమీదున్న దక్షిణాఫ్రికా.. అదే ఉత్సాహాన్ని ఇక్కడా కొనసాగించాలని చూస్తోంది.
జట్ల వివరాలు