సఫారీ స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ఈ మేరకు ప్రకటన చేశాడు. వన్డే, టీ20ల్లో మాత్రం కొనసాగనున్నట్లు ఈ 36 ఏళ్ల దక్షిణాఫ్రికా ఆటగాడు చెప్పాడు. పరిమిత ఓవర్ల కెరీర్‌పై మరింత దృష్టి సారించేందుకే ఐదు రోజుల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు స్టెయిన్ తెలిపాడు.
" నేను బాగా ప్రేమించే టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నా. క్రికెట్లో 5 రోజుల ఆటే అత్యుత్తమం అని భావిస్తా. ఎప్పటికీ టెస్టులు ఆడననే ఊహ భయంగా ఉంది. ఇప్పటి నుంచి వన్డే, టీ20లపై పూర్తి దృష్టి పెడతా. నా సామర్థ్యాన్ని వినియోగించి ఎక్కువ కాలం పాటు ఆటలో కొనసాగేందుకు ప్రయత్నిస్తా. పొట్టి ఫార్మాట్లో ప్రొటీస్ జట్టు తరఫున మరింత రాణిస్తాను ".
-డేల్ స్టెయిన్, దక్షిణాఫ్రికా బౌలర్