కరోనా ప్రభావంతో భారత పర్యటనను మధ్యలోనే ఆపేసి, స్వదేశానికి వెళ్లిపోయిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. సభ్యులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని ఆ జట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షోయబ్ మన్‌జ్రా చెప్పారు.
కరోనా విషయంలో ఊపిరి పీల్చుకున్న సఫారీ క్రికెటర్లు - South African cricketers
గత కొన్నిరోజుల నుంచి క్వారంటైన్లో ఉన్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా పరీక్షల్లో వారికి నెగిటివ్ వచ్చింది.
దక్షిణాఫ్రికా క్రికెటర్లు
కోహ్లీసేనతో మూడు వన్డేల సిరీస్ కోసం భారత్ వచ్చారు సఫారీలు. మొహాలీ వేదికగా గత నెల 12న తొలి మ్యాచ్ జరగాల్సి ఉన్నా, వర్షం కారణంగా అది నిలిచిపోయింది. అనంతరం కరోనా ప్రభావం వల్ల మొత్తం సిరీస్‌నే రద్దు చేశారు.
దీంతో స్వదేశానికి చేరుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు.. 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదని డాక్టర్ మన్‌జ్రా వెల్లడించారు.