టీ20 క్రికెట్ వచ్చాక బౌలింగ్, బ్యాటింగ్ శైలిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. బ్యాట్స్‌మెన్.. విభిన్న షాట్లతో అలరిస్తున్నారు. విచిత్రమైన శైలి బౌలింగ్‌తో బౌలర్లూ ఆకట్టుకుంటున్నారు. కొందరైతే ఏకంగా రెండు చేతులతోనూ బౌలింగ్ చేసి ఔరా అనిపిస్తున్నారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ గ్రెగొరీ మహ్లొక్వానా..ఇలానే రెండు చేతులతో బౌలింగ్ చేసి వికెట్లు తీశాడు. వీక్షకులను ఆశ్చర్యపరిచాడు.
దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న ఓ టీ20 సూపర్ లీగ్‌లో కేప్‌టౌన్ బ్లిడ్జ్ తరఫున బరిలోకి దిగాడు గ్రెగొరీ. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో కుడి చేత్తో బౌలింగ్ చేసి ఓపెనర్ సరెన్ వికెట్ తీశాడు.తర్వాత ఎడమ చేత్తో బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టు డర్బన్ హీట్ కెప్టెన్ డేన్ విలాస్‌ను పెవిలియన్ చేర్చాడు.