ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆటగాడు క్రిస్‌మోరిస్ వినూత్న రీతిలో వికెట్ తీశాడు. ఫుట్‌బాల్ తరహాలో బంతిని తన్ని పరుగు తీసేందుకు ప్రయత్నించిన బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేశాడు.
శనివారం సిడ్నీ సిక్సర్స్-సిడ్నీ థండర్స్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. సిక్సర్స్ జట్టు బ్యాటింగ్ ఆరంభించగా థండర్స్ జట్టు క్రిస్ మోరిస్‌కు బంతినిచ్చింది. తొలి ఓవర్ వేసిన మోరిస్.. ఓపెనర్ డానియల్ హ్యూస్‌ను విచిత్రంగా ఔట్ చేశాడు. పేసర్ మోరిస్ వేసిన బంతిని వికెట్ల వద్దే ఆడిన హ్యూస్.. పరుగు కోసం యత్నించగా వెంటనే అప్రమత్తమైన బౌలర్ బంతి వద్దకు పరుగెత్తి ఫుట్‌బాల్‌ని తన్నినట్టు బంతి వికెట్ల వైపు తన్నాడు.
మోరిస్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల హ్యూస్ ఔటయ్యాడు. బిగ్‌బాష్ లీగ్ ఆ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేయగానే నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్సీబీ ఆటగాడు మోరిస్ వైవిధ్యం చూసిన ఆ జట్టు అభిమానులు... ఈసారి కోహ్లీ జట్టుకు కప్పు ఖాయమని కామెంట్లు పెడుతున్నారు.