తెలంగాణ

telangana

ETV Bharat / sports

దక్షిణాఫ్రికాతో తొలివన్డేలో మిథాలీసేన ఓటమి - మిథాలీ రాజ్​ వార్తలు

లఖ్​నవూ వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలివన్డేలో భారత మహిళల జట్టు ఓటిమిపాలైంది. తొలుత టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన మిథాలీ సేన.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన సఫారీ జట్టు మరో పది ఓవర్ల మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

South Africa women beat India by 8 wickets in 1st ODI to take 1-0 lead
దక్షిణాఫ్రికాతో తొలివన్డేలో మిథాలీసేన ఓటమి

By

Published : Mar 7, 2021, 4:53 PM IST

దాదాపుగా ఏడాది తర్వాత మైదానంలో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఓటమిపాలైంది. ప్రత్యర్థి ఓపెనర్లు​ లిజెల్​ లీ(83), లారా వోల్వార్డ్​ట్​(80) అర్ధశతకాలతో చెలరేగడం వల్ల.. 8 వికెట్ల తేడాతో సఫారీ జట్టు గెలుపొందింది. ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా మూడు వికెట్లు పడగొట్టిన దక్షిణాఫ్రికా బౌలర్​ శబ్నిమ్​ ఇస్మాయిల్​ నిలిచింది.

అంతకుముందు, టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన మిథాలీ సేన.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ చేసిన మిథాలీ.. కెప్టెన్ ఇన్నింగ్స్​ ఆడింది. మరో బ్యాట్స్​వుమెన్ హర్మన్​ ప్రీత్​ కౌర్​ 40 పరుగులతో ఫర్వాలేదనిపించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో శబ్నిమ్ ఇస్మాయిల్​ మూడు వికెట్లతో రాణించింది.

ఇదీ చూడండి:ఏడాది తర్వాత మైదానంలోకి.. తొలి వన్డేలో భారత్​ 177/9

ABOUT THE AUTHOR

...view details