తెలంగాణ

telangana

ETV Bharat / sports

వార్మప్ మ్యాచ్​ తొలిరోజు వర్షార్పణం - india vs south africa

దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ మధ్య జరుగుతోన్న వార్మప్ మ్యాచ్​కు వర్షం అడ్డంకిగా మారింది. తొలిరోజు ఆట వర్షార్పణం అయింది.

మ్యాచ్

By

Published : Sep 26, 2019, 4:12 PM IST

Updated : Oct 2, 2019, 2:38 AM IST

దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ మధ్య వార్మప్​ మ్యాచ్​ నేడు ప్రారంభమైంది. కానీ తొలిరోజే వర్షం కారణంగా ఒక్క ఓవర్ పడకుండానే ఆట తుడిచిపెట్టుకుపోయింది. విజయనగరం వేదికగా జరగుతోన్న ఈ మ్యాచ్​లో ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నాయి.

టెస్టు సిరీస్​కు ముందు దక్షిణాఫ్రికాకు ఇదొక్కటే ప్రాక్టీస్ మ్యాచ్​. పరిస్థితులపై అవగాహన కల్పించుకునేందుకు సఫారీ జట్టుకు ఇదో మంచి అవకాశం.

టెస్టుల్లో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తోన్న టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్​ కీలకం కానుంది. విశాఖపట్నం వేదికగా వచ్చే నెల 2న ప్రారంభం కాబోతున్న మొదటి టెస్టులో తొలిసారిగా ఓపెనర్​గా బరిలోకి దిగబోతున్నాడు హిట్​మ్యాన్. అలాగే మయాంక్ అగర్వాల్, ఉమేశ్ యాదవ్​ సత్తా చాటాలని భావిస్తున్నారు.

ఇవీ చూడండి.. ఒక్క ఛాన్స్ ఇవ్వమని.. బతిమాలా: సచిన్​

Last Updated : Oct 2, 2019, 2:38 AM IST

ABOUT THE AUTHOR

...view details