శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో చేజిక్కించుకుంది. మూడు రోజుల్లోపే ముగిసిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడో రోజు మంగళవారం, ఓవర్ నైట్ స్కోరు 150/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక.. 211 పరుగులకు ఆలౌటైంది. ఎంగిడి (4/44), సిపమ్లా (3/40), నార్జ్ (2/64) లంక పతనాన్ని శాసించారు.
లంకపై దక్షిణాఫ్రికా గెలుపు.. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ - cricket news
దక్షిణాఫ్రికా జట్టు టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. లంకపై రెండు టెస్టులోనూ గెలిచి, సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
లంకపై దక్షిణాఫ్రికా గెలుపు.. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్
ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 91తో బ్యాటింగ్ కొనసాగించిన కరుణరత్నె సెంచరీ (103) పూర్తి చేసుకున్నా.. త్వరగానే ఔటయ్యాడు. 67 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా వికెట్ పోకుండా ఛేదించింది. ఓపెనర్లు మార్‌క్రమ్ (36 నాటౌట్), ఎల్గర్ (31 నాటౌట్) అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 157 పరుగులకు కుప్పకూలగా.. దక్షిణాఫ్రికా 302 పరుగులకు ఆలౌటైంది.