దక్షిణాఫ్రికాపై పాక్ గెలుపు...
ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. పాకిస్థాన్ 49 పరుగుల తేడాతో ప్రొటీస్‌పై జయకేతనం ఎగురవేసింది. రియాజ్, షాదాబ్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు.
2019-06-23 22:59:40
దక్షిణాఫ్రికాపై పాక్ గెలుపు...
ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. పాకిస్థాన్ 49 పరుగుల తేడాతో ప్రొటీస్‌పై జయకేతనం ఎగురవేసింది. రియాజ్, షాదాబ్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు.
2019-06-23 22:53:13
వాహ్వా వాహబ్...
వాహబ్ రియాజ్ యార్కర్లకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ దగ్గర బదులు లేకుండా పోయింది. తన వరుస ఓవర్లలో ముగ్గురిని బౌల్డ్ చేశాడు వాహబ్.
2019-06-23 22:43:32
విజయానికి చేరువలో పాక్...!
పాకిస్థాన్ దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఇంకా 3 ఓవర్లలో ప్రొటీస్ 70 పరుగులు సాధించాలి. ఇప్పటికే 8 వికెట్లు కోల్పోయింది. ఇక పాక్ విజయం దాదాపు ఖరారే..!
2019-06-23 22:33:06
మోరిస్ ఔట్...
మ్యాచ్‌లో పాకిస్థాన్ పట్టు బిగించింది. వరుస విరామాల్లో వికెట్లు తీస్తోంది. మోరిస్ (16)ను రియాజ్ బౌల్ట్ చేశాడు.
2019-06-23 22:18:49
మిల్లర్ ఔట్...
దక్షిణాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. డసెన్ ఔటైన వెంటనే మిల్లర్‌ను అఫ్రిది బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం ప్రోటీస్ 48 బంతుల్లో 112 పరుగులు చేయాల్సి ఉంది.
2019-06-23 22:09:38
డసెన్ ఔట్...
ఇప్పుడే గేరు మార్చిన దక్షిణాఫ్రికాను పాక్ బౌలర్ షాదాబ్ ఖాన్ దెబ్బతీశాడు. డసెన్ (36) ను ఔట్ చేశాడు. ఫెలుక్వాయో క్రీజులోకి వచ్చాడు.
2019-06-23 22:01:52
38 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు- 186/4
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ వాండర్ డుస్సెన్ 44 బంతుల్లో 35 పరుగులతో రాణిస్తున్నాడు. మరో బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ 32 బంతుల్లో 29 రన్స్‌తో క్రీజులో కొనసాగుతున్నాడు. 39వ ఓవర్ వేసిన రియాజ్ నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
2019-06-23 21:59:28
38 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు- 182/4
సఫారీ జట్టు బ్యాట్స్‌మెన్ వాండర్ డుస్సెన్ 42 బంతుల్లో 33 పరుగులతో రాణిస్తున్నాడు. మరో బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ 28 బంతుల్లో 28 రన్స్‌తో క్రీజులో కొనసాగుతున్నాడు.38వ ఓవర్ వేసిన షాహిన్ 14 పరుగులు ఇచ్చుకున్నాడు. వాటిలో ఒక సిక్స్, ఒక ఫోర్ ఉంది.
2019-06-23 21:52:50
37 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు- 168/4
సఫారీ జట్టు బ్యాట్స్‌మెన్ వాండర్ డుస్సెన్ 40 బంతుల్లో 26 పరుగులతో రాణిస్తున్నాడు. మరో బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ 24 బంతుల్లో 21 రన్స్‌తో క్రీజులో కొనసాగుతున్నాడు. 37వ ఓవర్లో మిల్లర్ మరోసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రియాజ్ వేసిన బంతిని మిల్లర్ థర్డ్ మ్యాన్ దిశగా భారీ షాట్ ఆడగా ఆమిర్ అందివచ్చిన బంతిని పట్టుకోలేకపోయాడు.
2019-06-23 21:39:13
34 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు- 152/4
నాలుగు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది సఫారీ జట్టు. వాండర్ డుస్సెన్ 31 బంతుల్లో 21 పరుగులతో రాణిస్తున్నాడు. మరో బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ 15 బంతుల్లో 11 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు.
2019-06-23 21:29:11
మిల్లర్ క్యాచ్ మిస్..
31వ ఓవర్ తొలి బంతికి డేవిడ్ మిల్లర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆమిర్ బంతి వేయగా అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. కాని దాన్ని ఒడిసిపట్టడంలో కాస్త విఫలమయ్యాడు. ఫలితంగా ఈ స్టార్ హిట్టర్ ఔటవ్వకుండా బయటపడ్డాడు.
2019-06-23 21:22:06
కష్టాల్లో దక్షిణాఫ్రికా...
79 బంతుల్లో 63 పరుగులతో రాణిస్తోన్న సఫారీల సారథి డుప్లెసిస్‌ను ఔట్ చేశాడు ఆమిర్. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బ్యాట్ అంచుకు తాకిన బంతి పైకి లేచింది. దాన్ని చక్కగా అందుకోవడంలో సఫలమయ్యాడు పాక్ కీపర్ సర్ఫరాజ్
2019-06-23 21:13:27
దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ ఖాతాలో మరో అర్ధశతకం చేరింది. కెరీర్ 34వ హాఫ్ సెంచరీని సాధించాడు. ప్రపంచకప్‌లో ఆరో అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు.
2019-06-23 21:09:02
27 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు- 118/3
26వ ఓవర్ వేసిన షాదాబ్ 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 27వ ఓవర్లో ఇమాద్ 6 పరుగులు సమర్పించుకున్నాడు. క్రీజులో దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ 71 బంతుల్లో 55 పరుగులు, వాండర్ డుస్సెన్ 7 బంతుల్లో ఒక పరుగు చేసి క్రీజులో ఉన్నారు.
2019-06-23 20:54:01
షాదాబ్ మాయ...
16 బంతుల్లో 7 పరుగులతో రాణిస్తోన్న ఏయిడెన్ మార్‌క్రమ్‌ను పెవిలియన్ చేర్చాడు షాదాబ్ ఖాన్. అద్భుతంగా బౌల్డ్ చేసి సఫారీలను ఆత్మరక్షణలో నెట్టాడు. 24వ ఓవర్ వేసిన షాదాబ్ పరుగులేమి ఇవ్వకుండా ఒక వికెట్ తీశాడు. 25వ ఓవర్ వేసిన ఇమాద్ వసీం మూడు పరుగులే ఇచ్చాడు.
25 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు- 106/3
2019-06-23 20:51:30
కెరీర్లో 50వ వికెట్...
కీలక సమయంలో డికాక్‌ను ఔట్ చేసిన షాదాబ్... కెరీర్లో 50వ వికెట్ సాధించాడు.
2019-06-23 20:46:24
అర్ధశతకం మిస్...
60 బంతుల్లో 47 పరుగులతో రాణిస్తోన్న డికాక్‌ను పెవిలియన్ చేర్చాడు షాదాబ్ ఖాన్. భారీ షాట్ ఆడే క్రమంలో బౌండరీ లైన్ సమీపంలో ఇమామ్ చేతికి చిక్కాడు. 20వ ఓవర్ వేసిన షాదాబ్ రెండు పరుగులు మాత్రమే ఇచ్చి కీలక వికెట్ సాధించాడు.
20 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు- 92/2
2019-06-23 20:41:11
19 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు- 90/2
దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ 52 బంతుల్లో 40 పరుగులు, డికాక్ 59 బంతుల్లో 47 పరుగులతో క్రీజులో ఉన్నారు. 19 ఓవర్ వేసిన రియాజ్ 13 పరుగులు ఇచ్చుకున్నాడు. వీటిలో ఒక ఫోర్, ఒక సిక్స్ ఉంది.
2019-06-23 20:35:28
18 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు- 77/1
దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ 49 బంతుల్లో 38 పరుగులు, డికాక్ 56 బంతుల్లో 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. 18 ఓవర్ వేసిన షబాద్ ఖాన్ 4 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు.
2019-06-23 20:11:29
12 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు- 51/1
దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ 35 బంతుల్లో 31 పరుగులు, డికాక్ 34 బంతుల్లో 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
2019-06-23 19:44:15
నడిపిస్తోన్న సారథి...
దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ 13 బంతుల్లో 10 పరుగులు, డికాక్ 13 బంతుల్లో 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
5 ఓవర్లలో సఫారీల స్కోరు- 23 పరుగులు (1 వికెట్ నష్టానికి)
2019-06-23 19:33:17
ఆరంభంలోనే వికెట్...
309 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా. 3 బంతుల్లో 2 పరుగులు చేసిన ఆమ్లా.. ఆమిర్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు.
2019-06-23 18:50:17
పాకిస్థాన్- 308/7...
దక్షిణాఫ్రికా బౌలింగ్ యూనిట్‌ను సమర్థంగా ఎదుర్కొన్న పాక్ మంచి స్కోరు సాధించింది. హారీస్ (89), బాబర్ (69) పరుగులతో రాణించారు. ప్రొటీస్ బౌలర్లలో ఎంగిడికి 3 వికెట్లు దక్కాయి.
2019-06-23 18:45:04
వాహబ్ ఔట్...
పాక్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌కు చేరుకొంది. ఎంగిడి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి వాహబ్ (4) బౌల్డ్ అయ్యాడు. స్కోరు 305 వద్ద ఉంది.
2019-06-23 18:38:33
ఇమాద్ ఔట్...
స్కోరు బోర్డును 300 దాటించేందుకు జోరు పెంచిన పాక్‌కు బ్రేక్ పడింది. ఇమాద్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డుమినీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో హారీస్ 83 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
2019-06-23 18:24:45
హారీస్ సిక్సర్లు...
హారీస్, ఇమాద్ జోరు పెంచారు. ప్రొటీస్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడుతున్నారు. హారీస్ 80 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
2019-06-23 18:19:50
అర్ధశతకంతో రాణిస్తోన్న హ్యారిస్...
పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ హ్యారిస్ 47 బంతుల్లో 72 పరుగులతో వేగంగా ఆడుతున్నాడు. మరో ఎండ్‌లో ఇమాద్ వసీం క్రీజులో ఉన్నాడు.
45 ఓవర్లకు పాకిస్థాన్ స్కోరు-266/4
2019-06-23 18:07:52
కీలక వికెట్ కోల్పోయిన పాక్...
41వ ఓవర్ రెండవ బంతికి బాబర్ అజాంను ఔట్ చేశాడు ఫెలుక్వాయో. 80 బంతుల్లో 69 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు బాబర్.
42 ఓవర్లకు పాకిస్థాన్ స్కోరు- 229/4
2019-06-23 17:47:09
అర్ధశతకం సాధించిన బాబర్...
61 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజాం. ఇప్పటివరకు 69 వన్డేలు ఆడిన ఈ బ్యాట్స్‌మెన్ 13 అర్ధశతకాలు సాధించాడు. తాజాగా చేసిన అర్ధసెంచరీ కెరీర్లో 14వది. ఈ మెగాటోర్నీలో రెండోది.
2019-06-23 17:37:07
భారీ ఇన్నింగ్స్ దిశగా పాక్...
31ఓవర్ తొలి బంతికి హారిస్ సోహేల్ సింగిల్ తీయడంవ వల్ల పాక్ జట్టు 150 పరుగుల మార్కు చేరుకుంది.
2019-06-23 17:23:18
భారీ ఇన్నింగ్స్ దిశగా పాక్...
31ఓవర్ తొలి బంతికి హారిస్ సోహేల్ సింగిల్ తీయడంవ వల్ల పాక్ జట్టు 150 పరుగుల మార్కు చేరుకుంది.
2019-06-23 17:11:18
ఇమ్రాన్ ఖాతాలో రికార్డు...
ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన ఇమ్రాన్ తాహిర్... సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఐసీసీ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా ఘనత సాధించాడు. ఇప్పటివరకు 39 వికెట్లు తీశాడీ పరాశక్తి ఎక్స్‌ప్రెస్
2019-06-23 17:08:48
ఒకే దగ్గర ఇద్దరూ..
పాకిస్థాన్ జట్టులోని మరో ఓపెనర్ ఇమాముల్ హక్‌ను(57 బంతుల్లో 44 పరుగులు) పెవిలియన్ చేర్చాడు ఇమ్రాన్ తాహిర్. ఈ మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీశాడీ పేసర్ పరాశక్తి ఎక్స్‌ప్రెస్. ప్రస్తుతం బాబర్ అజాం (17 బంతుల్లో 8 పరుగులు)చేసి నాటౌట్‌గా ఉన్నాడు. హఫీజ్ 3 బంతుల్లో పరుగులేమి చేయకుండా క్రీజులో ఉన్నాడు.
పాకిస్థాన్ స్కోరు - 21 ఓవర్లకు 98 పరుగులు (రెండు వికెట్ల నష్టానికి)
2019-06-23 16:50:42
అర్ధశతకం కోల్పోయిన ఫకర్ జమాన్...
నిలకడగా రాణిస్తోన్న పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్‌ను(50 బంతుల్లో 44 పరుగులు) పెవిలియన్ చేర్చాడు ఇమ్రాన్ తాహిర్. మరో ఎండ్‌లో ఇమాముల్ హక్ 40 బంతుల్లో 35 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఫకర్ తర్వాత బాబర్ అజామ్ బ్యాటింగ్‌కు వచ్చాడు.
పాకిస్థాన్ స్కోరు - 15 ఓవర్లకు 81 పరుగులు (ఒక వికెట్ నష్టానికి)
2019-06-23 16:45:50
2019-06-23 16:35:42
ఓపెనింగ్ భాగస్వామ్యం అదుర్స్
పాకిస్థాన్ ఓపెనర్లు ఇమాముల్ హక్( 35 బంతుల్లో 33 పరుగులు), ఫకర్ జమాన్(44 బంతుల్లో 38 పరుగులు) చేసి నిలకడగా రాణిస్తున్నారు. దక్షిణాఫ్రికా పేస్ బౌలర్లను ఎదుర్కొంటూ 70 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు.
పాకిస్థాన్ స్కోరు - 13 ఓవర్లకు 73 పరుగులు (వికెట్ నష్టపోకుండా)
2019-06-23 16:16:07
ఓపెనర్ల హవా...
పాకిస్థాన్ ఓపెనర్లు ఇమాముల్ హక్( 30 బంతుల్లో 30 పరుగులు), ఫకర్ జమాన్(30 బంతుల్లో 27 పరుగులు) చేసి నిలకడగా రాణిస్తున్నారు. దక్షిణాఫ్రికా పేస్ బౌలర్లను ఎదుర్కొంటూ బౌండరీలు రాబడుతున్నారు. ఇద్దరు బ్యాట్స్మెన్లు దాదాపు 100 సగటుతో జోరు కొనసాగిస్తున్నారు.
పాకిస్థాన్ స్కోరు - 10 ఓవర్లకు 58 పరుగులు (వికెట్ నష్టపోకుండా)
2019-06-23 16:03:22
నిలకడగా ఆడుతున్న పాకిస్థాన్
నిలకడతో పాటు దూకుడుగా ఆడుతున్న పాకిస్థాన్ 7 ఓవర్లు ముగిసే సరికి 46 పరుగులు చేసింది. క్రీజులో ఇమాముల్ హక్, ఫకర్ జమాన్ ఉన్నారు. ఇమామ్ 21, ఫకర్ 24 పరుగులు చేశారు.
2019-06-23 15:58:04
నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్
బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించింది. క్రీజులో ఫకర్ జమాన్, ఇమాముల్ హక్ ఉన్నారు. మూడు ఓవర్లు ముగిసే సరికి 17 పరుగులు చేసింది.
2019-06-23 15:54:03
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
లార్డ్స్ వేేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఇక్కడ జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే.
జట్లు
పాకిస్థాన్: సర్ఫరాజ్(కెప్టెన్), హఫీజ్, షోయాబ్ మాలిక్, బాబర్ అజాం, ఇమాముల్ హక్, ఇమాద్ వసీమ్, వాహబ్ రియాజ్, ఫకర్ జమాన్, షాదాబ్ ఖాన్, హారీస్ సొహైల్
దక్షిణాఫ్రికా: ఆమ్లా, డికాక్, డుప్లెసిస్, మిల్లర్, మోరిస్, వాన్డర్డసెన్, మార్క్రమ్, తాహిర్, రబాడా, ఫెలుక్వాయో, ఎంగిడి
2019-06-23 15:32:26
కొద్దిసేపట్లో దక్షిణాఫ్రికా- పాకిస్థాన్ మ్యాచ్
ఈ ప్రపంచకప్‌లో లార్డ్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. దక్షిణాఫ్రికా- పాకిస్థాన్ తలపడనున్నాయి. 3 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి వైదొలగింది సఫారీ జట్టు. ఈ రోజు గెలిచి రేసులో నిలవాలని భావిస్తోంది పాక్. మరి గెలుపు ఎవరి సొంతం అవుతుందో చూడాలి.
2019-06-23 15:25:18
కొద్దిసేపట్లో దక్షిణాఫ్రికా- పాకిస్థాన్ మ్యాచ్
ఈ ప్రపంచకప్‌లో లార్డ్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. దక్షిణాఫ్రికా- పాకిస్థాన్ తలపడనున్నాయి. 3 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి వైదొలగింది సఫారీ జట్టు. ఈ రోజు గెలిచి రేసులో నిలవాలని భావిస్తోంది పాక్. మరి గెలుపు ఎవరి సొంతం అవుతుందో చూడాలి.
2019-06-23 15:07:16
కొద్దిసేపట్లో దక్షిణాఫ్రికా- పాకిస్థాన్ మ్యాచ్
ఈ ప్రపంచకప్‌లో లార్డ్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. దక్షిణాఫ్రికా- పాకిస్థాన్ తలపడనున్నాయి. 3 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి వైదొలగింది సఫారీ జట్టు. ఈ రోజు గెలిచి రేసులో నిలవాలని భావిస్తోంది పాక్. మరి గెలుపు ఎవరి సొంతం అవుతుందో చూడాలి.
2019-06-23 14:41:57
కొద్దిసేపట్లో దక్షిణాఫ్రికా- పాకిస్థాన్ మ్యాచ్
ఈ ప్రపంచకప్‌లో లార్డ్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. దక్షిణాఫ్రికా- పాకిస్థాన్ తలపడనున్నాయి. 3 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి వైదొలగింది సఫారీ జట్టు. ఈ రోజు గెలిచి రేసులో నిలవాలని భావిస్తోంది పాక్. మరి గెలుపు ఎవరి సొంతం అవుతుందో చూడాలి.
2019-06-23 14:04:18
కొద్దిసేపట్లో దక్షిణాఫ్రికా- పాకిస్థాన్ మ్యాచ్
ఈ ప్రపంచకప్‌లో లార్డ్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. దక్షిణాఫ్రికా- పాకిస్థాన్ తలపడనున్నాయి. 3 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి వైదొలగింది సఫారీ జట్టు. ఈ రోజు గెలిచి రేసులో నిలవాలని భావిస్తోంది పాక్. మరి గెలుపు ఎవరి సొంతం అవుతుందో చూడాలి.