తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​ తర్వాత వీడ్కోలు - CRICKET SOUTH AFRICA

ప్రపంచకప్​ తర్వాత  క్రికెటర్ డుమినీ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. పొట్టి ఫార్మాట్​లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు.

ప్రపంచకప్​ తర్వాత రిటైర్ కానున్న డుమిని

By

Published : Mar 16, 2019, 6:15 AM IST

ప్రపంచకప్​ తర్వాత మరో క్రికెటర్ వన్డేలకు వీడ్కోలు పలకనున్నాడు. మే నుంచి ఇంగ్లండ్​లో జరిగే మెగాటోర్నీ అనంతరం వన్డే క్రికెట్​ నుంచి రిటైర్​ అవనున్నాడుదక్షిణాఫ్రికా ఆల్​రౌండర్ జేపీ డుమినీ . ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా ట్విట్టర్​లో ప్రకటించింది.


నేను వన్డేలకు వీడ్కోలు చెప్పేందుకు ఇది సరైన సమయం అనుకుంటున్నా. దేశీయ, అంతర్జాతీయ టీ20లు ఆడతాను. నా మొదటి ప్రాధాన్యం కుటుంబానికే.. తర్వాతే ఏదైనా. ఎంతోగానో సహకరించిన జట్టు సభ్యులకు కృతజ్ఞతలు.

---జేపీ డుమినీ,దక్షిణాఫ్రికా క్రికెటర్

34 ఏళ్ల డుమినీ... సెప్టెంబరు 2017లో టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈ ఫార్మాట్​లో 46 మ్యాచ్​లాడిన డుమిని 32.85 సగటుతో 2,103 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్​లో 193 మ్యాచ్​లాడి 37.39 సగటుతో 5,047 రన్స్ సాధించాడు. స్పిన్ బౌలర్​గా 68 వికెట్లు తీశాడు.

ఇదే జట్టుకు చెందిన స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్..ప్రపంచకప్​ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని ముందుగానే ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి:


ABOUT THE AUTHOR

...view details