తెలంగాణ

telangana

ETV Bharat / sports

డివిలియర్స్​ను తిరిగి రమ్మంటా: మార్క్ బౌచర్ - South Africa cricket Coach Boucher

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్‌ను తిరిగి రప్పిస్తానని అన్నాడు దక్షిణాఫ్రికా కోచ్ బౌచర్​. అతడితో సహా ఇటీవల రిటైరైన స్టార్‌ క్రికెటర్లను తిరిగి జట్టులోకి రావాలని ఒప్పించడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.

South Africa cricket Coach Boucher said.. ask to abd play agian cricket
మార్క్ బౌచర్

By

Published : Dec 16, 2019, 7:44 AM IST

Updated : Dec 16, 2019, 11:47 AM IST

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికా జట్టు ప్రభావం తగ్గిందనే చెప్పాలి. ప్రపంచకప్ వైఫల్యం, భారత పర్యటనలో చేతులెత్తేయడమే ఇందుకు ఉదాహరణ. సఫారీలకు పూర్వ వైభవం తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు ఆ జట్టు నూతన కోచ్ మార్క్ బౌచర్. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్‌ సహా ఇటీవల రిటైరైన స్టార్‌ క్రికెటర్లను తిరిగి జట్టులోకి రావాలని ఒప్పించడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.

"ప్రపంచకప్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు జట్టుకు ప్రాతినిధ్యం వహించాలి. ఏబీ డివిలియర్స్‌ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడన్నది నా ఉద్దేశం. నేనెందుకు అతడితో మాట్లాడకూడదు? ఇప్పుడే బాధ్యతలు అందుకున్నా. ఇంకొందరితో కూడా నేను మాట్లాడే అవకాశముంది. జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలి. మీడియాతో, జట్టు సహచరులతో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి. దక్షిణాఫ్రికా క్రికెట్‌ మేలు కోసమే ఇదంతా" -మార్క్ బౌచర్‌, దక్షిణాఫ్రికా నూతన కోచ్​

బౌచర్‌ శనివారమే దక్షిణాఫ్రికా కోచ్‌గా నియమితుడయ్యాడు. 2023 వరకు అతను బాధ్యతలు నిర్వర్తిస్తాడు.

ఇదీ చదవండి: ఐపీఎల్​ 2020: యువ తేజాలపై కన్నేసిన ఫ్రాంఛైజీలు

Last Updated : Dec 16, 2019, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details